Roadster X And X Plus: రోడ్ స్టర్ సిరీస్తో ఓలా ఎలక్ట్రిక్..! 1 y ago

featured-image

ఓలా ఎలక్ట్రిక్ తమ కొత్త రెండు ఎలక్ట్రిక్ టూవీలర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ ఎక్స్ ప్లస్ పేర్లతో ఓలా ఎలక్ట్రిక్ తీసుకొచ్చింది. ఈ బైకులు రూ.74,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఈ బైకులు వాటికి మూడు బ్యాటరీ ఉంటాయి, 144 కిలోమీటర్ల నుంచి 501 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది ఒకసారి ఛార్జింగ్‌తో 144 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ₹84,999 ధరతో, 201 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అలాగే, 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ₹94,999 ధరతో, ఇది 259 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రోడర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ లో 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ₹1,04,999కి లభిస్తుంది, ఇది కూడా అదే రేంజ్ 259 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక 9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ₹1,54,999 ధరతో 501 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది.

ఈ బైకుల్లో రివర్స్ మోడ్, క్రూజ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లను కూడా పొందవచ్చు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త బైకులు, ప్రత్యేకించి ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారికి, ఓలా మంచి ఎంపికగా నిలుస్తోంది.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD